ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం జేసీ నిధిమీనా ఆదేశాల మేరకు రూ.38 కోట్ల హౌసింగ్ నిధుల మాయంపై మెప్మా సీఓలు, సచివాలయ అమెనిటీస్ సెక్రటరీలతో జిల్లా హౌసింగ్ పీడీ రాజారత్నం విచారణ చేపట్టారు.
పులివెందుల(ఆగస్ట్, 14): పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయ సంఘాల నేతలను శుక్రవారం DEO శంషుద్దీన్ సస్పెండ్ చేశారు. YSRTA రాష్ట్ర కార్యదర్శి వెంకటనాధ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ రెడ్డి, STU జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర రెడ్డిలను సస్పెండ్ చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపుపై ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని కలవడానికి వీరు వెళ్లారు. YSRCP ఎంపీలు, ఉపాధ్యాయ MLCలతో కలిసి వీరు డిల్లీకి వెళ్లారు. వీరిపై CCA రూల్స్ మేరకు అంటూ DEO సస్పెండ్ చేశారు. *వీరిని సస్పెండ్ చేయడంపై జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉపాద్యాయులు, సంఘాల నేతలు మండిపడుతున్నారు. సస్పెండ్ అయిన ఉపాధ్యాయ నేతలు కేంద్ర మంత్రిని కలవలేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యంగా టెట్ మినహాయింపుపై మాత్రమే అక్కడికి వెళ్లారని అంటున్నారు.
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 7) ఆ బ్యాంకులో ఏదో జరుగుతోందని ప్రొద్దుటూరు ప్రజలు చర్చించుకుంటున్నారు. బ్యాంకులోని సీసీ కెమెరాల లైవ్ మొబైల్లో యాక్సెస్ చేసుకొని బయటికి చేర వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. బ్యాంక్ పాలన నిర్వహణపై టిడిపి నేత ప్రవీణ్ ఆరోపణలు చేశారు. సహకార, RBI అధికారులకు ఫిర్యాదు చేశారు. DLCO సత్యానంద్ ఆధ్వర్యంలో బ్యాంకులో రికార్డుల తనిఖీ జరిగింది. బ్యాంక్ అధికారులకు సూచనలు ఇచ్చామని DLCO మీడియాకు వెల్లడించారు. ఆవెంటనే బకాయి దారులకు నోటీసులు వెళ్లాయి. ఇప్పుడు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజులుగా RBI అధికారులు బ్యాంకులో రికార్డుల పరిశీలన చేపట్టారు. బ్యాంకుపై వచ్చిన ఆరోపణలపై చైర్మన్ పట్టించుకోకపోవడంతో మొదటగా మాజీ చైర్మన్ ముందుకు వచ్చి ఖండించారు. నష్టం జరిగాక టీడీపీ నేతల ఆదేశాలతో చైర్మన్ రిజాండర్ ఇచ్చారు. ఈ వరుస సంఘటనలతో బ్యాంకులో ఏదో జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాలకవర్గం, అధికారులు ఖాతాదారుల అనుమానాలు, ఆందోళనను నివృత్తి చేయాల్సి ఉంది. - ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Pr...
ప్రొద్దుటూరు(జూలై, 31): ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇంచార్జ్ చైర్మన్ గా పట్నం లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్ వద్ది సురేఖ రాజీనామాకు స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అంగీకారం తెలిపారు. శుక్రవారం రాజీనామా లేఖను మార్కెట్ కమిటీ సెక్రటరీ రత్నరాజు ప్రభుత్వానికి పంపించారు. వైస్ చైర్మన్ లక్ష్మణ్ ఇంచార్జ్ చైర్మన్ గా కొనసాగించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయన సెప్టెంబర్ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. - ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.