పోస్ట్‌లు

2026లోని పోస్ట్‌లను చూపుతోంది

కల్లాపి రంగు ఫ్యాక్టరీలపై కేసులు: జిల్లా ఎస్పీ విశ్వనాధ్

చిత్రం
ప్రొద్దుటూరులోని కల్లాపి రంగు పౌడర్ తయారీ యూనిట్లపై దాడులు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ విశ్వనాథ్ బుధవారం తెలిపారు.  ప్రొద్దుటూరు తహశీల్దార్ ఫిర్యాదు మేరకు సౌభాగ్య, కామదేను, మహాలక్ష్మి, చంద్రిక, శ్రీదేవి-భూదేవి ఫ్యాక్టరీలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ పౌడర్ వల్ల జిల్లాలో 19 మంది సూసైడ్ చేసుకొని మరణించారని తెలిపారు. సంబంధిత అన్ని శాఖల అధికారులతో సంయుక్తంగా దాడులు చేసి సీజ్ చేశామాన్నారు.

ఉప్పాగు కాల్వపై వివాదం.. పరస్పరం ఫిర్యాదు.!

చిత్రం
ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ పరిధిలోని మునిసిపల్ కంపోస్ట్ యార్డు రోడ్డులో ఉప్పాగు కాల్వ మళ్లింపుపై వివాదం నెలకొంది.  భూ యజమానికి, రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్వాహకులకు మధ్య వివాదంతో బుధవారం ఎమ్మార్వోకు ఫిర్యాదులు చేసుకున్నారు.

సచివాలయాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్.!

చిత్రం
పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి బుధవారం పట్టణంలోని వార్డ్ సచివాలయాలను సందర్శించారు.  SIR మ్యాపింగ్ డిజిటలైజేషన్ ప్రక్రియపై బిఎల్ఓలతో సమీక్షించారు.  గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

పూజ స్కూల్ వివాదంపై ఆర్డీవో విచారణ.!

చిత్రం
పొద్దుటూరు మండలం చౌడూరులోని పూజ స్కూల్ వివాదంపై బుధవారం జమ్మలమడుగు ఆర్డిఓ శిరీష విచారణ నిర్వహించారు.  స్కూల్ పౌండర్ రాజారెడ్డి హత్యతో రూ.కోట్ల ఆస్తుల కోసం బంధువులు, రాధా, కవిత మూడు గ్రూపులు గొడవ పడుతున్నాయి. డిపాజిట్లు, టీసీల కోసం పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. విచారణకు వెళ్లిన అధికారులను స్కూల్ నిర్వాహకులు కవిత లోనికి అనుమతించకపోవడంతో, పొద్దుటూరు ఎమ్మార్వో కార్యాలయంలో ఆర్డీవో విచారణ జరిపారు.

వైయస్సార్ జయంతి.. రోగులకు పండ్లు పంపిణీ.!

చిత్రం
వైయస్సార్ జయంతిని పురస్కరించుకుని బుధవారం స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.  వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

పొద్దుటూరులో సూసైడ్ ఫ్యాక్టరీలు సీజ్.!

చిత్రం
పొద్దుటూరు శివారు ప్రాంతంలోని విషపూరిత ప్రమాదకర కల్లాపి రంగు రసాయనాలను తయారు చేస్తున్న ఐదు ఫ్యాక్టరీలను బుధవారం ఉదయం అధికారులు సీజ్ చేశారు.  ఇక్కడ తయారైన రసాయనాలను సేవించి కడప జిల్లాలో 18 మంది సూసైడ్ చేసుకున్నారు.  ఇతర ప్రాంతాల్లో మరి కొంతమంది సూసైడ్ చేసుకున్నారు.  వీటిని అధికారులు సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

చిత్రం
బుధవారం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తనిఖీ చేశారు.  నేత్ర విభాగం, ఆయుష్ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు.    ఆస్పత్రిలో రీల్స్ తీయడంపై పరిపాలన, సెక్యూరిటీ లోపాలపై అధికారులతో సమీక్షించారు.

డిప్యూటీ ఈఓను సన్మానించిన APTF నాయకులు.!

చిత్రం
ప్రొద్దుటూరు డిప్యూటీ ఈఓగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శివప్రసాద్ ను మంగళవారం APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ నేతల కలిశారు.  సన్మానించారు. సమస్యలను విన్నవించుకున్నారు.  పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు.

పశువులపై ప్రయోగాలపై విద్యార్థులకు శిక్షణ.!

చిత్రం
ప్రొద్దుటూరు ప్రభుత్వ వెటర్నరీ కళాశాలలో మంగళవారం పశువులపై ప్రయోగాలు నిర్వహించడంపై వెటర్నరీ విద్యార్థులకు ల్యాబ్ శిక్షణ ఇచ్చారు.  అసోసియేట్ డీన్ రాధాకృష్ణ, ప్రొఫెసర్స్ కళ్యాణి, శ్రీనివాస నాయక్, కళ్యాణ చక్రవర్తి, శ్రీవాణి, మోని తెరిసా, అశోక్ కుమార్, వెటర్నరీ విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రొద్దుటూలో కల్లాపి రంగు ఫ్యాక్టరీలపై ఆకస్మిక దాడులు.!

చిత్రం
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ASP విభుకృష్ణ ఆధ్వర్యంలో పొద్దుటూరులోని నిషేధిత రసాయన కల్లాపి రంగు ఫ్యాక్టరీలపై మంగళవారం సాయంత్రం ఆరు చోట్ల అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు.  నిషేధిత రసాయనాలను సీజ్ చేశారు.  ఈ రసాయనాల వల్ల మరణాలు సంభవిస్తుండడంతో ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు.  ప్రొద్దుటూరు సీఐలు కొండారెడ్డి, వంశీనాథ్, రామాంజనేయుడు, నాగభూషణ్, స్థానిక ఎస్సైలు, ఎస్బిఐ సిఐలు భాస్కర రెడ్డి, రెడ్డప్ప, విజిలెన్స్ సీఐ శ్రీనివాసుల రెడ్డి, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ చిన్నారావు, తహసిల్దార్ ఉదయభాస్కర రాజు, ఫైర్ ఆఫీసర్ బసవి రెడ్డి, ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారులు దాడుల్లో పాల్గొన్నారు.

పంటల సాగుకు రైతులు తొందర పడొద్దు: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

చిత్రం
ఎలినో పరిస్థితుల్లో ఈసారి వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, రైతులు తొందరపడి పంటల సాగుకు ఎరువులు విత్తనాలు కొని, భూమిలో వేయొద్దని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మంగళవారం తన కార్యాలయంలో మీడియా సమావేశంలో సూచించారు.

పొద్దుటూరులో సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులు.!

చిత్రం
పొద్దుటూరులో మంగళవారం సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులను ఆ పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, రాజకీయ పరిస్థితులు, ప్రజల సమస్యలు, సిపిఎం అనుసరించాల్సిన విధానాలపై సమావేశంలో చర్చించారు.

రూ.38కోట్లు మాయం.. మెప్మా, అమెనిటీస్ పాత్రపై హౌసింగ్ పీడీ విచారణ.!

చిత్రం
ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం జేసీ నిధిమీనా ఆదేశాల మేరకు రూ.38 కోట్ల హౌసింగ్ నిధుల మాయంపై మెప్మా, సచివాలయ అమెనిటీస్ సెక్రటరీలతో జిల్లా హౌసింగ్ పీడీ రాజారత్నం విచారణ చేపట్టారు.

ప్రొద్దుటూరు హౌసింగ్ స్కాంపై విచారణ.!

చిత్రం
ప్రొద్దుటూరు హౌసింగ్ స్కాంపై మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులు విచారణ చేపట్టారు.  హౌసింగ్ లబ్ధిదారుల నుంచి మెప్మా ఉద్యోగులు, సచివాలయాల ఆమెనిటీస్ సెక్రటరీలు వసూలు చేసిన సుమారు రూ.38 కోట్లకు లెక్కలు చెప్పాలంటూ విచారణ చేపట్టారు.  జిల్లా హౌసింగ్ పీడీ రాజారత్నం ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్, ప్రొద్దుటూరు మెప్మా అధికారులు, సచివాలయాల ఆమెనిటీస్ సెక్రటరీలు, హౌసింగ్ ఇంజనీర్లు, డిఆర్డిఎ, యండిఓ అధికారులతో జాయింట్ కో-ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు.

కడప జిల్లాలో 41 మంది డీటిలు బదిలీ.!

చిత్రం
ఉమ్మడి కడప జిల్లాలో 41 మంది డిప్యూటీ తాసిల్దార్లను సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ బదిలీ చేశారు. వీరిలో కొంతమంది సీనియర్ అసిస్టెంట్లకు డీటీలుగా పదోన్నతులు కల్పించారు.  ప్రొద్దుటూరుకు డీటీలుగా ఏకాంత్, అలీఖాన్, సృజన ప్రియ నియమితులయ్యారు.

పెంపుడు జంతువులకు ఉచిత టీకాలు.!

చిత్రం
వరల్డ్ జునోసెస్ డే సందర్భంగా సోమవారం ప్రొద్దుటూరు వెటర్నరీ కాలేజీలో పెంపుడు జంతువులకు కాలేజీ అసోసియేట్ డీన్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఉచితంగా యాంటీ రేబీస్ టీకాలు వేశారు.  

చెన్నంరాజుపల్లెలో పశు వైద్య శిబిరం.!

చిత్రం
ప్రొద్దుటూరు మండలం చెన్నంరాజుపల్లెలో సోమవారం పశు వైద్య కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రారంభించారు.