పోస్ట్‌లు

విద్యా వార్తలు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు సన్మానం.!

చిత్రం
ప్రొద్దుటూరు PRUSMA ఆధ్వర్యంలో  డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - 2026 పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం శుక్రవారం  ప్రొద్దుటూరు గోల్డెన్ పార్క్ నందు నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎన్నికైన గంగాధర్ ను  ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సన్మానించారు.   ఈ కార్యక్రమంలో డిప్యూటీ DEO శివప్రసాద్, MEOలు సావిత్రమ్మ, శోభారాణి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు.

విద్యార్థులకు చెకుముకి సైన్స్ పోటీలు.!

చిత్రం
ప్రొద్దుటూరులో గురువారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో  పాఠశాల విద్యార్థులకు చెకుముకి సైన్స్ పోటీలను నిర్వించారు.  ఈ పోటీలకు 8500 మంది విద్యార్థులు హాజరయ్యారని JVV రాష్ట్ర కమిటీ సభ్యులు సునీత, చెకుముకి పోటీల కన్వీనర్ రవిబాబు తెలిపారు.  విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  పాఠశాల స్థాయి విజేతలకు సెప్టెంబర్ 11న తోగటవీర క్షత్రియ కళ్యాణమండపంలో కార్యక్రమం ఉంటుందన్నారు. -  ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

విద్యార్థులకు నగదు పంపిణీ.!

చిత్రం
ప్రొద్దుటూరు: స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ 10వ తరగతి పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో వచ్చిన విద్యార్థులకు రిటైడ్ టీచర్ ఈశ్వరరెడ్డి నగదు బహుమతి పంపిణీ చేశారు.  రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలు చొప్పున పంపిణీ చేశారు.  శనివారం ఇండిపెండెన్స్ డే సందర్భంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో HM,  టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.