ప్రొద్దుటూరులో YCP ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 10): పొద్దుటూరులో వైసీపీ ర్యాలీని పోలీసులు అడ్డుతున్నారు. సోమవారం ఉదయం వైసిపి ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలకు నిరసనగా ర్యాలీ చేపట్టారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉదయం మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. 10 గంటలకు ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ అడ్డుకోవడానికి సబ్ డివిజన్ పరిధిలోని సీఐ, ఎస్సై, సుమారు 70 మంది పోలీసులను మోహరించారు. ర్యాలీని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది.