ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 7) ఆ బ్యాంకులో ఏదో జరుగుతోందని ప్రొద్దుటూరు ప్రజలు చర్చించుకుంటున్నారు. బ్యాంకులోని సీసీ కెమెరాల లైవ్ మొబైల్లో యాక్సెస్ చేసుకొని బయటికి చేర వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. బ్యాంక్ పాలన నిర్వహణపై టిడిపి నేత ప్రవీణ్ ఆరోపణలు చేశారు. సహకార, RBI అధికారులకు ఫిర్యాదు చేశారు. DLCO సత్యానంద్ ఆధ్వర్యంలో బ్యాంకులో రికార్డుల తనిఖీ జరిగింది. బ్యాంక్ అధికారులకు సూచనలు ఇచ్చామని DLCO మీడియాకు వెల్లడించారు. ఆవెంటనే బకాయి దారులకు నోటీసులు వెళ్లాయి. ఇప్పుడు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజులుగా RBI అధికారులు బ్యాంకులో రికార్డుల పరిశీలన చేపట్టారు. బ్యాంకుపై వచ్చిన ఆరోపణలపై చైర్మన్ పట్టించుకోకపోవడంతో మొదటగా మాజీ చైర్మన్ ముందుకు వచ్చి ఖండించారు. నష్టం జరిగాక టీడీపీ నేతల ఆదేశాలతో చైర్మన్ రిజాండర్ ఇచ్చారు. ఈ వరుస సంఘటనలతో బ్యాంకులో ఏదో జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాలకవర్గం, అధికారులు ఖాతాదారుల అనుమానాలు, ఆందోళనను నివృత్తి చేయాల్సి ఉంది.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.