ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

పులివెందుల(ఆగస్ట్, 14): పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయ సంఘాల నేతలను శుక్రవారం DEO శంషుద్దీన్ సస్పెండ్ చేశారు.  YSRTA రాష్ట్ర కార్యదర్శి వెంకటనాధ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ రెడ్డి, STU జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర రెడ్డిలను సస్పెండ్ చేశారు.  ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపుపై ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని కలవడానికి వీరు వెళ్లారు.  YSRCP ఎంపీలు, ఉపాధ్యాయ MLCలతో కలిసి వీరు డిల్లీకి వెళ్లారు.  వీరిపై CCA రూల్స్ మేరకు అంటూ DEO సస్పెండ్ చేశారు.
*వీరిని సస్పెండ్ చేయడంపై జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉపాద్యాయులు, సంఘాల నేతలు మండిపడుతున్నారు.  సస్పెండ్ అయిన ఉపాధ్యాయ నేతలు కేంద్ర మంత్రిని కలవలేదని,  ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యంగా టెట్ మినహాయింపుపై మాత్రమే అక్కడికి వెళ్లారని అంటున్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!