ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!
ప్రొద్దుటూరు(జూలై, 31): ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇంచార్జ్ చైర్మన్ గా పట్నం లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్ వద్ది సురేఖ రాజీనామాకు స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అంగీకారం తెలిపారు. శుక్రవారం రాజీనామా లేఖను మార్కెట్ కమిటీ సెక్రటరీ రత్నరాజు ప్రభుత్వానికి పంపించారు. వైస్ చైర్మన్ లక్ష్మణ్ ఇంచార్జ్ చైర్మన్ గా కొనసాగించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయన సెప్టెంబర్ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.