PDTR MLAని సన్మానించిన చేనేతలు.!
ప్రొద్దుటూరు (ఆగస్, 11) ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని చేనేతలు సన్మానించారు. 2 సంవత్సరాల కూటమి పాలనపై ఆయన మంగళవారం స్థానిక 29వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన చేనేతలకు వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ.25వేలు జమ చేసిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆ వార్డులోని చేనేత పథకం పొందిన లబ్ధిదారులు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని సన్మానించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక టిడిపి నేతలు, చేనేత సంఘాల నేతలు ఉన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.