ప్రొద్దుటూరులో CID సోదాలు.!
ప్రొద్దుటూరు MRO, SRO కార్యాలయాల్లో CID అధికారులు సోదాలు నిర్వహించారు. తిరుపతి CID CI రారాజు ఆధ్వర్యంలో సోదాలు జరిపారు. అగ్రిగోల్డ్ భూముల రికార్డులను పరిశీలించారు. ప్రొద్దుటూరు మండలంలోని 1.70 ఎకరాల అగ్రిగోల్డ్ భూముల అక్రమ లాభాదేవీలు,
రిజిస్ట్రేషన్లపై స్థానిక రెవిన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులను విచారించారు. ఈ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై ఇటీవల స్థానిక MLA వరదరాజుల రెడ్డి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈమేరకు CID సోదాలు నిర్వహించారు.