ప్రభుత్వంపై ఇకపై పోరాటమే: CPM
ప్రొద్దుటూరు: పోరాటాల ద్వారానే ప్రభుత్వ హామీలను సాధించుకోవాలని సిపిఎం ప్రొద్దుటూరు కార్యదర్శి సత్యనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిందన్నారు. ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. పేదలకు 2,3 సెంట్ల ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం, అర్హులందరికీ పెన్షన్లు, నిరుద్యోగ యువతకు భృతి ఎక్కడని ప్రశ్నించారు. వీటిపై సోమవారం కడప కలెక్టరేట్ వద్ద ధర్నాకు ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.