చెన్నంరాజుపల్లెలో రసాయనాలు లేని కూరగాయల సాగు.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 11): స్థానిక చెన్నంరాజుపల్లెలో రైతు శేఖర్ ద్రవ జీవామృతం ద్వారా, రసాయనాలు లేని కూరగాయల సాగును చేపట్టి, అధిక లాభాలు పొందాడని మండల వ్యవసాయ అధికారి వరహరి కుమార్ తెలిపారు. మంగళవారం ఆ పొలంలోకి ఇతర రైతులను తీసుకెళ్లి జీవామృతం ద్వారా పంటలసాగును చూపించారు. చీడ పీడలు లేని వంగ, బెండ, టమోటా, గోగు తదితర కూరగాయల పంటల సాగును పరిశీలించారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.