శంకరుని నిధులు బాలాజీ ఖాతాలోకి జమ.?
ప్రొద్దుటూరు శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో (శివాలయంలో) 2021-25లో రూ.62 లక్షల ఫ్రాడ్ జరిగిందని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆడిట్ అనుమతి, బిల్లులు లేకుండా నిధులు డ్రా చేశారని గుర్తించారు. పెయింట్ పేరుతో ఖర్చు రాసిన రూ.5 లక్షలకు బిల్లులు లేవన్నారు. ఈ విధంగా రూ.62 లక్షల ఖర్చులకు సరైన లెక్కలు పత్రాలు లేవన్నారు. వీటిపై ఈనెల 17న తిరుపతి RJC నుంచి రాష్ట్ర కమిషనర్ కార్యాలయానికి 100 పేజీల రిపోర్ట్ పంపారు. ఫ్రాడ్ జరిగిన సమయంలో ఆలయ ఈఓగా శంకర బాలాజీ ఉన్నట్లు గుర్తించారు. మద్యలో కేవలం 6 నెలలు మాత్రమే రామచంద్రాచార్యులు, వెంకటసుబ్బయ్య ఈఓలుగా పని చేశారు.
*ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయానికి భక్తులు ఇచ్చిన కానుకలు, విరాళాలు, దాన ధర్మాలు శంకర బాలాజీ ఖాతాలోకి వెళ్ళాయని రాష్ట్ర దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితుల్లో శంకర బాలాజీ ఈఓగా పనిచేసిన బ్రహ్మంగారి మఠం, గీతాశ్రమం, అల్లాడుపల్లె వీరభద్ర స్వామి ఆలయాల్లో విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.