ఆసుపత్రిలో పరుగులు తీసిన సిబ్బంది.!
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం వైద్యులు, సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్, అటెంటర్స్, ఫైర్ డిపార్ట్మెంట్, ఔట్ పోస్ట్ పోలీసులు పరుగులు తీశారు. రోగులను స్టెక్చర్లపై తోసుకుంటూ హడావుడి పడ్డారు. ఏమి జరుగుతుందోనని అక్కడివారు ఆందోళన పడ్డారు. విచారిస్తే.. అత్యవసర పరిస్థితులపై, ఫైర్ యాక్సిడెంట్ లపై మాక్ డ్రిల్, అవగాహన నిర్వహించినట్లు ఫైర్ ఆఫీసర్ బసివిరెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ఆనంద్ బాబు తెలిపారు.