ప్రొద్దుటూరు కమిషనర్ జాతీయ జెండాను అవమానపరిచారా.?

ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు.  ఈ సందర్భంగా త్రివర్ణ పతాకం రూపాన్ని అందరూ నడిచే నేలపై రూపొందించారు.  కింద త్రివర్ణ పతాకం రూపాన్ని ఉంచి, అంతకన్నా ఎక్కువ ఎత్తులో వేదికపై వేడుకలు నిర్వహించారు.  ఈ విధంగా చేయడం " Prevention of Insults to National Honour Act, 1971లోని Section 2 ప్రకారం జాతీయ జెండాను తొక్కడం లేదా దానికి ఇతర విధాలుగా అవమానం చేయడం శిక్షార్హమైన నేరం " అని ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఇర్ఫాన్ బాషా తెలిపారు.  మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!