ప్రొద్దుటూరులో నకిలీ పోలీసులు అరెస్ట్.! రూరల్ ఎస్సై రాజు

ప్రొద్దుటూరు శివారు ప్రాంతంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ అంటూ పోలీస్ లాఠీలతో బెదిరిస్తూ, డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం రూరల్ ఎస్సై రాజు అరెస్ట్ చేశారు.  శంకరాపురంకు చెందిన సాయినాధ రెడ్డి, చౌడూరుకు చెందిన రవి మద్యం సేవిస్తున్న వారి వద్దకు, ప్రేమ జంటల వద్దకు వెళ్లి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు.  ప్రొద్దుటూరుకు చెందిన నిహాన్ కుమార్ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశామన్నారు.  రూ.1000 నగదు, లాటీలు స్వాధీనం చేసుకున్నామన్నారు.  ఇటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్సై రాజు సూచించారు..

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!