పాత నేరస్తుడు అరెస్ట్.. గంజాయి స్వాధీనం: సిఐ కొండారెడ్డి

ప్రొద్దుటూరు 1టౌన్ పోలీసులు గురువారం పాత నేరస్తున్ని అరెస్ట్ చేసి, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.  స్థానిక 1టౌన్ సీఐ కొండారెడ్డి వివరాల మేరకు..
నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన షేక్ జిలాని పొద్దుటూరులో ట్రాక్టర్ డ్రైవర్ గా ఉంటూ గంజాయి విక్రయం చేస్తున్నాడు.  గుంతకల్ నుంచి గంజాయి కొనుగోలు చేసి, ప్రొద్దుటూరులో విక్రయిస్తున్నాడు.  ఇటీవల UPకి చెందిన ఐస్ క్రీం వాలా పింటుకు అమ్మగా, మిగతా 385 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కడప రైల్వే పోలీస్ స్టేషన్, ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో పాత కేసులు ఉన్నాయన్నారు. గతంలో గంజాయి కేసులో జైలుకు వెళ్లి వచ్చాడన్నారు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!