బారులో గొడవ.. CBIT, SRIT ఇంజనీరింగ్ విద్యార్థుల అరెస్ట్.!

ప్రొద్దుటూరు: స్థానిక జమ్మలమడుగు రోడ్డులో స్వప్న బార్ వద్ద రెండు రోజుల క్రితం ఇంజనీరింగ్ విద్యార్థులు కొట్టుకున్నారు.  బీరు సీసాలు, రాళ్ళు, కట్టెలతో దాడులు చేశారు. లోకేశ్వరరెడ్డి అనే యువకునికి దెబ్బలు తగిలాయి.  ఈ ఘటనకు సంబంధించి పొద్దుటూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.  ఎస్సైలు రాజు, శ్రీకాంత్ విచారణ చేపట్టారు.  శనివారం 11 మందిని అరెస్ట్ చేశారు.  వీరిలో స్థానిక CBIT, SRIT ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 9 మంది విద్యార్థులు ఉన్నారు.  ఈ ఘటనకు సంబంధించి మిగతా వారిని త్వరలో పట్టుకొని అరెస్ట్ చేస్తామని రూరల్ సీఐ నాగభూషణ్ తెలిపారు.
*స్థానిక ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లేమి, మామూళ్ల వల్ల
ప్రొద్దుటూరులో 24/7 మందు, గంజా మత్తు అందుబాటులో ఉండడంతోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.  ఇక్కడ పలు విద్యాసంస్థలు ఉన్నాయి.  వీరిలో కొంతమంది మందు, గంజాకు అలవాటు పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.  అమ్మాయిలు, ఆదిపత్యం కోసం గొడవలు పడుతున్నారు.  రెండు రోజుల క్రితం అమ్మాయి కోసం ఇంజనీరింగ్ విద్యార్థులు కొట్టుకున్నారు.
గతంలో సునీల్ గ్యాంగ్ విద్యార్థులను మత్తుకు అలవాటు చేసి, నేరాలకు వాడుకున్నారు.  మళ్లీ అటువంటివి జరక్కుండా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
- ‎ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!