పొద్దుటూరులో వివాదాల కమిషనర్.!
ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ప్రచారయావతో వివాదాల్లో పడ్డారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రొద్దుటూరులో కుక్కలు, పందులు, దోమల బెడద ఎక్కువగా ఉంది. వీటి బారిన పడి ప్రజలు ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరిన ఫిర్యాదుదారులపై కమిషనర్ ప్రొద్దుటూరు ప్రజలను కుక్కల కన్నా డేంజర్ అంటూ అవమానించడంపై స్థానికులు మండిపడుతున్నారు. పిర్యాదుదారులతో కమిషనర్ వ్యవహరిస్తున్న తీరుపై వారు నొచ్చుకుంటున్నారు. ఇటువంటి వివాదాల కమిషనర్ ను పొద్దుటూరుకు పంపిన ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ప్రజలు నడిచే నేలపై జాతీయ జెండా రూపాన్ని ఉంచారు. కమిషనర్ బూట్లు ధరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఇర్ఫాన్, మరి కొంతమంది ఫిర్యాదుపై ఇప్పటివరకు చర్యలు తీసులేదు. స్వచ్ఛ సంకల్ప దీక్ష పేరుతో కమిషనర్ చేపట్టిన కార్యక్రమాలు, నిధులు వ్యయం, అనుమతుల వివరాలను ఇప్పటివరకు వెల్లడించలేదు. కమిషనర్ వివాదాస్పద చర్యలతో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.