అమృతనగర్ కాలనీకి కరెంట్ ఇవ్వండి సార్.!
పొద్దుటూరు మండలం అమృతనగర్ కాలనీకి కరెంట్ ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో స్థానికులు సోమవారం విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిఈ చాంద్ భాషాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి సత్యం మాట్లాడుతూ..
విద్యుత్ సరఫరా లేక ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో పేదలు ఇళ్లు నిర్మించుకోలేక పోతున్నారన్నారు. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే పలు మార్లు ఎమ్మార్వో, ఎండిఓ, పంచాయతీ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించామన్నారు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.