అసెంబ్లీలో ప్యానల్ స్పీకర్లు వీరే.!
కడప జిల్లాకు చెందిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి(టిడిపి), బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ(వైసీపీ)ను రాష్ట్ర అసెంబ్లీలో ప్యానల్ స్పీకర్లుగా సోమవారం నియమించారు. మండలి బుద్ధప్రసాద్, కోళ్ళ లలితకుమారి, జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్ రాజును ప్యానల్ స్పీకర్లుగా నియమించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేని సమయంలో ప్యానల్ స్పీకర్లు సభను నిర్వహిస్తారు.