దోమల నివారణకు పట్టించుకోరా.!: కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి

ప్రొద్దుటూరు పట్టణంలో పారిశుధ్య పరిస్థితి అధ్వానంగా తయారైందని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఇర్ఫాన్ బాషా తెలిపారు.  ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పట్టణంలో ఎక్కడ చూసినా దోమలు విపరీతంగా ఉన్నాయన్నారు.  వాటి వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు.  ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.  ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో దోమల నివారణకు చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.  ప్రచార ఆర్భాటాలు మానుకుని, ప్రజలను దోమల బారి నుండి కాపాడాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!