ఉద్యోగులంతా రిపోర్ట్ చేసుకోవాలి: మున్సిపల్ కమిషనర్

ప్రొద్దుటూరు మున్సిపల్, సచివాలయ ఉద్యోగులు తమ సెలవులు రద్దు చేసుకొని, డ్యూటీలో రిపోర్టు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ఆదివారం మీడియా ద్వారా ఆదేశించారు.  ఆదేశాలను పాటించని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
*ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితా (ఎస్.ఐ.ఆర్) నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  అసిస్టెంట్ ఎలక్టరోల్ రిటర్నింగ్ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు బూత్ స్థాయిఅధికారులు (బిఎల్ఓలు) తమ విధులు సక్రమంగా నిర్వహిచడం లేదన్నారు.  ఫోన్లో కూడా అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో ఎస్ఐఆర్ / ఎన్నికల విధులకు ఆటంకం కలుగుతుందన్నారు.  ఇప్పటికే సెలవులో ఉన్న సిబ్బందిని మునిసిపల్ కమీషనర్ కార్యాలయానికి రిపోర్ట్ చేయమని ఆదేశాలు జరిచేశామని. ఆదేశాలు అతిక్రమించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!