నీటి సరఫరాలో ఇబ్బందులు రాకూడదు: కమిషనర్

ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం త్రాగునీటి సరఫరాపై కమిషనర్ విశ్వనాథ్ సంబంధిత అధికారులు, సిబ్బందితో సమీక్షించారు.  ప్రధానంగా మైలవరం డ్యామ్ నుంచి పొద్దుటూరు పట్టణానికి త్రాగునీరు అందిస్తున్నారు.  2025 లెక్కల ప్రకారం ప్రొద్దుటూరులో సుమారు రెండు లక్షల జనాభా ఉన్నారు.  ఇక్కడ 43 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. ప్రస్తుతం 27 MLD వాటర్ సరఫరా చేస్తున్నారు. 135 లీటర్ల చొప్పున అందిస్తున్నారు. వీటిపై కమిషనర్ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులు, వార్డు సచివాలయాల అమినిటిస్ సెక్రటరీలతో సమీక్ష నిర్వహించారు.  నిర్ణీత సమయానికి నీటి సరఫరా చేయాలన్నారు.  త్రాగునీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలన్నారు.  ప్రతిరోజు వాటర్ టెస్టింగ్ నిర్వహించాలన్నారు.  సమావేశంలో ME శ్రీనివాసులు, DE రాజేష్, AE సురేంద్రనాద రెడ్డి పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!