సబ్ జైళ్లో ఇండిపెండెన్స్ డే.. పాల్గొన్న జడ్జి.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 15): స్థానిక సబ్ జైల్ రిమాండ్ ఖైదీలతో కలిసి ప్రొద్దుటూరు 2వ అదనపు జిల్లా జడ్జి సత్యకుమారి ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఖైదీలకు మిఠాయిలు పంపిణీ చేశారు. వారి హక్కులు, న్యాయసహాయం పొందడంపై వివరించారు. సబ్ జైల్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.