ప్రొద్దుటూరులో కొత్త వివాదం ప్రారంభం.!

ప్రొద్దుటూరులో కొత్త వివాదం ప్రారంభమైంది.  పొద్దుటూరు మొదటి నుంచి ప్రముఖ వ్యాపార కేంద్రం.  ఇక్కడ మార్వాడీలు లేరు.  స్థానికులే మొదటి నుంచి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.  ఇటీవల అక్కడికి కార్పోరేట్ కంపెనీలు దిగుమతి అయ్యాయి.  సెలూన్ మొదలుకొని జ్యువెలరీ వ్యాపారాల వరకు విస్తరించాయి.  కిరాణా కొట్టు మొదలుకొని కుదువ వ్యాపారం వరకు వారే ఉన్నారు.  దాంతో స్థానిక వ్యాపారులకు వ్యాపారం తగ్గిపోయింది.  ఇక్కడి సాంప్రదాయ వృత్తిలోని వారికి ఉపాధి పోయింది.  ఈ పరిస్థితుల్లో కొత్త వివాదం ప్రారంభమైంది.  కార్పొరేట్ వ్యాపారులు వెళ్లిపోవాలని, వారి రాకను అడ్డుకుంటామని స్థానిక వ్యాపారులు కొత్త ఉద్యమాన్ని తీసుకువచ్చారు.  వీరికి స్థానిక వైసీపీ, సీపీఐ నేతలు మద్దతు ఇచ్చారు.  భవిష్యత్తులో ఈ వ్యతిరేక ఉద్యమం ఎంతవరకు వెళ్తుందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!