గ్రామీణ ప్రజలకు రూరల్ సీఐ నాగభూషణ్ సూచన.!
ప్రొద్దుటూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు రూరల్ సీఐ నాగభూషణ్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన మంగళవారం ప్రొద్దుటూరు మండలం ఉప్పాగు, యానాదికాలనీ ప్రాంతాల్లో ప్రజలతో సమావేశం నిర్వహించారు. చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సైబర్ మోసాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపద్యంలో ప్రజలు ఘర్షణలకు దూరంగా ఉండాలన్నారు. ఎస్సైలు రాజు, శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.