నేతన్నలకు అన్యాయం: విజయ జ్యోతి
ప్రొద్దుటూరు(ఆగస్ట్,12): కూటమి ప్రభుత్వంలో మగ్గం నేసే చేనేతలకు ప్రభుత్వ పథకాలు అందడంలేదని, వారికి అన్యాయం జరుగుతోందని కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయ జ్యోతి విమర్శించారు. బుధవారం ప్రొద్దుటూరులో కొన్ని కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అటువంటి బాధితులంతా కాంగ్రెస్ పార్టీవైపు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తోందన్నారు. స్థానిక పార్టీ నేతలు ఇర్ఫాన్, గోసంగి సుబ్బారెడ్డి, పల్లా వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.