ప్రొద్దుటూరులో చీకట్లు తొలగిపోనున్నాయ్.!

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వీధిలైట్లు పాతవయ్యాయి. తరచూ రిపేర్లు వస్తున్నాయి.  మెటీరియల్ కొరతతో రిపేర్లు చేయడం లేదు.  కొత్త లైట్ల ఏర్పాటు జరగడం లేదు.  దీంతో పట్టణంలోని పలు వీధుల్లో రాత్రిపూట లైట్లు వెలగక, చీకట్లు కమ్ముకున్నాయి.  ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ఈ పరిస్థితుల్లో వీధి లైట్ల ఆధునీకరణకు EESL సంస్థతో ఒప్పందం చేసుకున్నారు.  పట్టణంలోని 7,340 పాత లైట్లను మారుస్తారు.  కొత్తగా మరో 800 లైట్లు ఏర్పాటు చేయనున్నారు.  వీటికి ON/OFF ఆటోమేటిక్ టైమర్ ఏర్పాటు చేస్తారు.  వీటన్నిటిపై గురువారం అనంతపురం ఆర్డి కార్యాలయంలో ప్రొద్దుటూరు మున్సిపల్ అధికారులు EESL సంస్థతో ఒప్పందం చేసుకున్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!