సచివాలయాల్లో పిర్యాదుల రిజిస్టర్.!
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 45 వార్డు సచివాలయాలు ఉన్నాయి. ప్రతి సచివాలయంలో పిర్యాదుల రిజిస్టర్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ఆదివారం మీడియాకు తెలిపారు. ప్రజలు స్థానిక సమస్యలపై సమీప సంబంధిత వార్డు సచివాలయంలో నేరుగా పిర్యాదు చేయాలని సూచించారు. పిర్యాదులపై సంబంధిత విభాగాల ఉద్యోగులు చర్యలు తీసుకుంటారన్నారు. ఆదివారం, ఇతర ప్రభుత్వ సెలవు రోజుల్లో అత్యవసర సేవల కోసం No.9849906669కు పిర్యాదు చేయాలన్నారు.