తక్కువ వర్షపాతం.. ఎక్కువ ఉష్ణోగ్రతలు: శాస్త్రవేత్తల బృందం

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలంలో గురువారం వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పర్యటించింది.  పంటల సాగును పరిశీలించారు.  రైతులతో సమావేశమయ్యారు.  ఎల్ నినో పరిస్థితులపై, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.  ఈసారి తక్కువ వర్షపాతం, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపారు.  కరువు పరిస్థితులను తట్టుకొనే పంటలను సాగు చేయాలని సూచించారు.  ఊటుకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన సైంటిస్ట్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సైంటిస్టులు సునీల్ కుమార్, సుబ్రహ్మణ్యం, ప్రొద్దుటూరు MAO వరహరి కుమార్, MEO రామ్మోహన్ రెడ్డి, BTM, VAAలు, మాజీ MPP రాఘవ రెడ్డి పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!