పులివెందులలో కేటుగాళ్ల అరెస్ట్.!
పులివెందుల: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు దండుకుని మోసం చేసిన కేటుగాళ్లను బుధవారం పులివెందుల పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి రూ.8 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీరామ్ సమాచారం మేరకు.. పులివెందులకు చెందిన మల్లికార్జున రెడ్డికి ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ విశాఖకు చెందిన జనప్రకాశ రావు డబ్బులు తీసుకొని మోసం చేశాడు. స్థానిక జనార్ధన్ నాయక్ కు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ తిరుపతి జిల్లాకు చెందిన కృష్ణయ్య మహేష్ డబ్బులు తీసుకొని మోసం చేశాడు. బాధితులు పిర్యాదు మేరకు నిదితులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ శ్రీరామ్ తెలిపారు.