స్థానిక వ్యాపారాలను దెబ్బ కొట్టేందే రాచమల్లు: ప్రవీణ్
ప్రొద్దుటూరులో స్థానిక వ్యాపారుల పొట్ట కొట్టిందే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అని టిడిపి నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బయటి నుంచి కార్పొరేట్ వ్యాపార సంస్థలను ఇక్కడికి తీసుకువచ్చిందే రాచమల్లు అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న రాచమల్లు ఎస్ఎస్ మాల్ అనుమతులు ఇప్పించారన్నారు. అందులోని వ్యాపారాలన్నీ కార్పొరేట్ సంస్థలకు చెందినవే అన్నారు.
రిలయన్స్, మ్యాక్స్, సీఎంఆర్, డిమార్ట్ తదితర కార్పొరేట్ వ్యాపార సంస్థలన్నీ ఆయన హయాంలోనే అనుమతులు తీసుకొని వచ్చాయన్నారు. తాము స్థానిక వ్యాపారులకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.