ప్రొద్దుటూరులో మార్పు మొదలైంది: ఇర్ఫాన్ బాషా
ప్రొద్దుటూరు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఇర్ఫాన్ భాష తెలిపారు. మంగళవారం ప్రొద్దుటూరులో జరిగిన కార్యక్రమంలో DCC అధ్యక్షురాలు విజయ జ్యోతి పార్టీలోకి కొత్తగా వచ్చిన 50 కుటుంబాల వారిని పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. కార్డీయక్రమంలో డీసీసీ కార్యదర్శి ఎల్లయ్య, యువజన కార్యదర్శి అబ్బాస్, మైనార్టీ నాయకులు మౌలాలి, గౌస్ తదితరులు పాల్గొన్నారు.