కుక్కల కన్నా మనుషులే డేంజర్: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్

ప్రొద్దుటూరు: కుక్కలకన్నా మనుషులే డేంజర్ అని స్థానిక మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు.  ఆయన సోమవారం ఫోన్ ఇన్ ముఖాముఖి కార్యక్రమంలో కుక్కల బెడదపై బాదితుని ఫిర్యాదుపై మాట్లాడుతూ.. అవి మనుషులను ఏమీ చేయవని, చాలా మంచివని, వాటికన్నా మనుషులే డేంజర్ అని అవహేళనగా మాట్లాడారు.  ప్రొద్దుటూరులో హోటళ్లు, ఆస్పత్రిల వ్యర్థాలను రోడ్లపై వేస్తున్నారన్నారు.  వాటికోసం చుట్టుపక్కల ప్రాంతాల కుక్కలు పొద్దుటూరులోకి వస్తున్నాయన్నారు.  దీనిపై చుట్టుపక్కల మున్సిపాలిటీల కమిషనర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  ఒక్కో మున్సిపాలిటీ పరిధిలోని కుక్కల తోకలకు ఒక్కో కలర్ వేయనున్నట్లు తెలిపారు.  దాంతో ఎవరి కుక్కలను వారు గుర్తించవచ్చన్నారు.  ఈ సోదంతా చెప్పి.. చివరికి ప్రొద్దుటూరులో 
కుక్కల బెడద నివారణకు మున్సిపల్ కమిషనర్ గా తాను తీసుకునే శాశ్వత పరిష్కారం గురించి మాత్రం
ఆయన తెలపలేదు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!