కుక్కలకన్నా మనుషులే డేంజర్ పై.. మున్సిపల్ ఆర్డీ విచారణ.!
అనంతపురం: కుక్కల కన్నా మనుషులే డేంజర్ అంటూ ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ప్రొద్దుటూరు ప్రజలను అవమానించేలా సోమవారం ఫోన్ ఇన్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై అనంతపురం మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ నాగరాజు స్పందించారు. ఆవిధంగా కమీషనర్ విశ్వనాథ్ మాట్లాడి ఉండకూడదన్నారు. ఆ వ్యాఖ్యలు తప్పేనన్నారు. ప్రొద్దుటూరు కమిషనర్ నుంచి ఆ వ్యాఖ్యలపై వివరణ కోరతామన్నారు. ప్రజల సమస్యల పిర్యాదులపై అధికారులు బాధ్యతగా మాట్లాడాలన్నారు.