అధికార నేత అండతో మత్తు వ్యాపారం.!
ప్రొద్దుటూరులో అధికార పార్టీ నేత అండతోనే మత్తు పదార్థాల అమ్మకాల ముఠాలు వ్యాపారాలు కొనసాగిస్తున్నాయని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో విచ్చలవిడిగా అక్రమ మద్యం, కల్తీ మద్యం, గంజాయి, గుట్కా, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు అమ్ముతున్నారన్నారు. ఇటీవల వీటికి తోడు వ్యభిచార గృహాలు కూడా వచ్చాయన్నారు. వీటికి అలవాటు పడి యువత పెడదోరని పడుతుందన్నారు. వీటిని ప్రొద్దుటూరులో పూర్తిస్థాయిలో అరికట్టక పోతే తాను స్వయంగా నిరాహార ధీక్షకు పూనుకుంటానని హెచ్చరించారు.
- రాజకీయ వార్తలు