యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?
ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో కార్యక్రమాలకు మార్కెట్ యార్డు కాంపౌండ్ గోడను తొలగించారు. ఆ తర్వాత ఎవ్వరూ పట్టించు కోలేదు. ఈ పరిస్థితుల్లో యార్డు గోడౌన్లోని రూ.1.70 కోట్ల హౌసింగ్ డిపార్ట్మెంట్ ఐరన్ మాయమైంది. వీటిపై శనివారం స్థానిక MLA వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు AMC చైర్మన్ లక్ష్మణ్, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, సెక్రటరీ రత్నరాజు పరిశీలించారు. చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.