నరసింహాపురం ఊరంతా చేనేతలే.. ఒక్కరికీ సాయం అందలే.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 12): నరసింహస్వామి కొలువైన ప్రొద్దుటూరు మండలం నరసింహపురం గ్రామంలో చేనేత వృత్తిలో ప్రజలు జీవనం సాగిస్తున్నారు.  నరసింహాపురం ఊరంతా చేనేతలే అని చెప్తుంటారు.  చేనేత పథకం ఏదైనా మొదట ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు.  జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.25వేలు జమ చేసింది.  అయితే చేనేత గ్రామమైన నరసింహాపురంలో ఒక్కరికి కూడా ఈ పథకం రాలేదు.  దీనిపై అక్కడి చేనేతలు బుధవారం ఆ శాఖ అధికారిని నిలదీశారు.  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఒక్కో లబ్ధిదారుని నుంచి రూ.8-10వేలు అడిగారని, ఇవ్వక పోవడంతో, తమ పేర్లను పైకి పంపలేదని వాపోయారు.
*పూర్తి వీడియో కోసం @proddaturnews1 యూట్యూబ్ ఛానల్ వీక్షించండి.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!