ప్రొద్దుటూరులో అమ్మవారికి డైమండ్ శారీ అలంకరణ.!
ప్రొద్దుటూరు అమ్మవారిశాలలో బుధవారం నిజ శ్రావణ శుద్ధ సప్తమిని పురస్కరించుకుని అమ్మవారి ప్రతిష్టా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
ఉదయం సుప్రభాత సేవ, మంగళహారతితో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ గణపతి, రుద్ర, నవగ్రహ, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. మధ్యాహ్నం అవభృథస్నానం మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
ప్రతిష్టా దినోత్సవాన్ని పురస్కరించుకుని, అమ్మవారిని వజ్ర కిరీటం, డైమండ్ శారీతో అలంకరించారు. భక్తులు దర్శించుకున్నారు.