మున్సిపాలిటీలో ఎవ్వరికి మూడిందో.?

పొద్దుటూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ డే రోజున మున్సిపల్ గ్రౌండులో జరిగిన వేడుకల్లో జాతీయ జెండాను అవమాన పరిచారని ఆరోపణలు వచ్చాయి.  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఇర్ఫాన్ దీనిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు.  దీంతో ఎవ్వరికి మూడిందోనని మునిసిపల్ అధికారులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.  మునిసిపాలిటీలో ఆస్తి మార్పిడికి ఆర్ఐ రూ.20 లక్షలు తీసుకున్నాడని, మాజీ వైస్ చైర్మన్ బంగారెడ్డి ఆరోపణలు చేసిన గంటల్లోనే ఆర్ఐ రమేష్ సీటును కమిషనర్ మార్చారు.  విచారణకు ఆదేశించారు.  ఈ పరిస్థితుల్లో జాతీయ జెండాకు అవమానం జరిగిందనే ఆరోపణలపై ఎవ్వరిపై వేటు పడుతుందోనని మున్సిపల్ అధికారులు టెన్షన్ పడుతున్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!