రైల్వేగేట్ వద్ద దాడి ఘటనలో.. నలుగురిపై కేసు నమోదు.!
ప్రొద్దుటూరు రైల్వేగేట్ సమీపంలో జరిగిన దాడి ఘటనలో నలుగురు యువకులపై మంగళవారం స్థానిక రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రాజు వివరాల మేరకు.. వాజిపాయ్ నగర్ చెందిన చరణ్ అనే యువకున్ని అజయ్, అరుణ్, పండు, రాజశేఖర్ దాడిచేసి దారుణంగా కొట్టారు. చరణ్ తల్లి పిర్యాదు మేరకు ఆ నలుగురిపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టామని తెలిపారు.