ఫ్రీ పెయిడ్ మీటర్లు రోడ్డున పడేశాయ్.!
ప్రొద్దుటూరు: ప్రభుత్వం తీసుకు వచ్చిన
ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లతో ఉపాధి పోతోందని విద్యుత్ మీటర్స్ రీడర్స్ ఆందోళన చెందుతున్నారు. వారు బుధవారం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని కలిశారు. తమ పరిస్థితిని వివరించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తమను విద్యుత్ సంస్థలోనే అర్హతలను బట్టి ఔట్ సోర్సింగ్ విధానంలో నియామకం చేయాలని విజ్ఞప్తి చేశారు. తాము 25 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నామని తెలిపారు.