పేదలకు పక్కా ఇళ్లు ఎప్పుడు కట్టిస్తారు.?
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 10): ప్రొద్దుటూరుకు 23 వేల ప్రభుత్వ పక్కా ఇళ్లు మంజూరయ్యాయని, వాటిని పేదలకు కట్టించేదెప్పుడని, స్థానిక BJP నేతలు సోమవారం స్థానిక హౌసింగ్ డీఈ వెంకటసుబ్బయ్యను ప్రశ్నించారు. లబ్ధిదారులకు సకాలంలో పక్కా ఇళ్లను పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. హౌసింగ్ కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. BJP నేతలు నరేంద్ర, హరిక్రిష్ణ, చిరంజీవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | - Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.