మగ్గమే లేనోళ్లకు చేనేత పథకాలా.. టిడిపి మాజీలకేనా ప్రభుత్వ పథకాలు.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 9): ప్రొద్దుటూరులో మగ్గమే లేనోళ్లు చేనేత పథకాలు పొందారని, TDP మాజీ కౌన్సిలర్ గంజికుంట ఆంజనేయులు కుటుంబాలు, సోమ బాలయ్య సన్నిహితులు చేనేత ఆర్థిక సాయం పొందారని YCP మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో ఆరోపించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు మాత్రమే అందాల్సి ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీ నేతలే పేదలకు అందాల్సిన ప్రభుత్వ పథకాలను దోచుకున్నారని ఆరోపించారు. నిజమైన పేదలకు, లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందన్నారు.
*వీడియో కోసం @proddaturnews1 యూట్యూబ్ ఛానల్ వీక్షించండి.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.