విచారణకు రాలేని వారి ఇళ్లకు BLOలు వెళ్తారు: కమిషనర్

ప్రొద్దుటూరు: ఓటర్ల జాబితా SIR నోటీసులకు విచారణకు హాజరుకాలేని వయో వృద్ధులు,  అనారోగ్యముతో మంచానికే పరిమితమైన వారి ఇళ్ల వద్దకే BLOలు వెళ్లి వివరాలు నమోదు చేయాలని స్థానిక మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ఆదేశించారు.  ఆయన మంగళవారం స్థానిక భాకరాపేట వీధిలో నివాసం ఉంటున్న ముంగల బాలమ్మ అనే 90 సంవత్సరాల వృద్ధురాలు ఇంటికి వెళ్లారు.  SIRలో వివరాలు నమోదు చేశారు.  మొదట ఆమెకు మున్సిపల్ కార్యాలయానికి హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. కుటుంబ సభ్యుల ద్వారా ఆమె పరిస్థితి తెలుసుకున్న కమిషనర్ నేరుగా మంగళవారం BLO దీప్తిని వెంటబెట్టుకుని ఆమె ఇంటికి వెళ్లారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!