ప్రొద్దుటూరులో ఐస్ క్రీం వాలా.. గంజాయి విక్రేత.! ASP విభుకృష్ణ

ప్రొద్దుటూరులో UP రాష్ట్రానికి చెందిన పింటు కుమార్ ఐస్ క్రీం వ్యాపారం పేరుతో..  గంజాయి విక్రయిస్తుండగా పట్టుకొని అరెస్ట్ చేసినట్లు స్థానిక ASP విభుకృష్ణ తెలిపారు.
స్థానిక 1టౌన్ సీఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మధుసూదన్ రెడ్డి సిబ్బందితో కలిసి మంగళవారం దాడి చేశారు.  స్థానిక RTPP బైపాస్ రోడ్డులో పింటును అరెస్ట్ చేశారు.  అతని వద్ద నుంచి 1280 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.  ఈ కేసులో మరో ముద్దాయి తప్పించుకున్నాడు.  అతని కోసం గాలిస్తున్నట్లు ASP తెలిపారు.  
*గంజాయి విక్రయదారులతో పాటు వినియోగదారులపైన చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ హెచ్చరించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిషేధిత గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.  ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, యువతపై పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలన్నారు.  పిల్లల ప్రవర్తనపై పరిశీలన, పర్యవేక్షణ ఉండాలన్నారు.  విద్యాసంస్థల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!