హుండీల ఆదాయం రూ.9.37 లక్షలు.!
పొద్దుటూరు అగస్త్యేశ్వరాలయం (శివాలయం) హుండీలను గురువారం లెక్కించారు. గత 15 నెలల కాలంలో భక్తులు సమర్పించిన కానుకలు, నగదును లెక్కించారు. హుండీల లెక్కింపు ద్వారా రూ.9.37 లక్షలు ఆదాయం లభించినట్లు ఆలయ చైర్మన్ నారాయణరెడ్డి, ఈవో రమణ తెలిపారు. రామేశ్వరం ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం ఈవో శ్రీధర్, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.