ట్రాఫిక్ ఉల్లంఘనలపై నేడు 513 కేసులు నమోదు.. రూ.1,15,325లు జరిమానా.!
కడప(ఆగస్ట్, 9): ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 513 కేసులు నమోదు చేసి, రూ. 1,15,325 జరిమానా విధించడం జరిగిందని తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్లలో వెళ్లే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని జిల్లా ఎస్.పి గారు సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రమాదకరమని , రాంగ్ రూట్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.