22వ వార్డులో వైసీపీలోకి వలసలు.!
ప్రొద్దుటూరు: స్థానిక 22వ వార్డులో టీడీపీ నుంచి మైనార్టీ కుటుంబాలు సోమవారం వైసిపిలోకి చేరారు. మహమ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో వైసీపీ కండువాలు అప్పుకున్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ.. చంద్రబాబుపై ప్రజలకు భ్రమలు తొలిగాయన్నారు. చెప్పిన హామీలు చేయడం లేదని తెలుసుకున్నారన్నారు.