పోగొట్టుకున్న బంగారాన్ని అప్పగించిన ప్రొద్దుటూరు 1టౌన్ పోలీసులు.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 13): స్థానిక నేతాజీనగర్ కు చెందిన వృద్ధురాలు ప్యారిజాన్ గురువారం ఉదయం ఆటోలో పాత బస్టాండుకు వెళ్తూ, తనవెంట తెచ్చుకున్న రూ.10 లక్షల విలువైన బంగారు నగల బ్యాగు పోగొట్టుకుంది. స్థానిక 1టౌన్ పోలీసులను ఆశ్రయించింది. సీఐ కొండారెడ్డి వెంటనే ఎస్సై శ్రీనివాసులు, సిబ్బంది లాల్ పీరా, రామచంద్ర, శివకుమార్ టీంను పంపారు. వారు ఆటో వెళ్లిన మార్గంలో సీసీ కెమెరాల పుటేజీ పరిశీలిస్తూ వెళ్లారు. కాలేజీరోడ్డు వద్ద నగల బ్యాగు పడిపోవడం గుర్తించారు. అక్కడి వారిని విచారించారు. బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. వృద్ధురాలికి అప్పగించారు. ప్రజలు పోలీసులను అభినందిస్తున్నారు.